ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా ఉన్న దేశంలో లాక్ డౌన్ పొడిగింపు తప్పదన్న అంచనాల మధ్య కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఆరంభంలోనే బలహీనపడిన మార్కట్లు ఒక దశలో 600 పాయింట్లకు పైగా పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్ఠం లేదా 1.51 శాతం పడి 30,690 వద్ద, నిఫ్టీ 1.3 శాతం క్షీణించి 8995 వద్ద ముగిసింది. ఫైనాన్షియల్, ఆటో, రియల్ ఎస్టేట్ రంగ నష్టాలను మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఫార్మ, మెటల్ రంగ షేర్లు లాభపడ్డాయి.
బ్యాంకులు, ఆటో దెబ్బ : 9 వేల దిగువకు నిఫ్టీ