తన సోషల్ మీడియా అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారంటూ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మండిపడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఈ కేరళ కుట్టి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరారు. ఇక అనుపమ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరనే విషయం అందరికి తెలిసినదే. ఎప్పుడూ దక్షిణ సంప్రాదాయ దుస్తుల్లో ఉండే అనుపమ ఈ మధ్య కాస్తా జీన్స్, టిషర్ట్స్ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేగాక ఫేస్‌బుక్‌లో తరచూ ఫొటోలు షేర్ చేస్తూ.. ఈ భామ కాస్తా యాక్టివ్‌గా ఉండటం చూసి ఆమె అభిమానులు షాకవుతున్నారు. ఎప్పుడూ చీరలో, చుడీదార్ వంటి సంప్రాదాయ దుస్తుల్లో మెరిసే తమ అభిమాన హీరోయిన్‌ను.. ఇలా వెస్టర్న్ వేర్‌లో చూసి అభిమానుల్లో కొంతమంది మండిపడుతుంటే.. మరికొందరు బాగుందంటూ మురిసిపోతున్నారు. (కన్నడంలో నిన్ను కోరి)
ఎవరో వెధవలు నా ఫేస్‌బుక్ హ్యాక్ చేశారు: అనుపమ